ఆదిత్య ఫార్మసీ కళాశాలలో విజ్ఞానదాయకంగా వెబినార్

UPDATED 18th NOVEMBER 2020 WEDNESDAY 8:00 PM

గండేపల్లి (రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్యా ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన వెబినార్ విజ్ఞానదాయకంగా సాగింది. ఈ కార్యక్రమానికి అమెరికాలో పేటెంట్ కన్సెల్టెంట్ ఆఫీసర్, భారతదేశ ఫార్మాస్యూటిక్స్ రంగ నిపుణులు డాక్టర్ శ్యామ్ వంగల ముఖ్య అతిథిగా హాజరయ్యారు."ఓరల్ డిసింటెగ్రేటింగ్ టాబ్లెట్స్" అనే పేరిట జరిగిన వెబినార్ లో ఓరల్ విచ్ఛిన్నమైన టాబ్లెట్స్ లో వినియోగించే వివిధ పదార్థాలు, జీవసాఫల్యతకు దోహదపడే విధానం గురించి వివరంగా తెలియచేశారు. కరోనా దృష్ట్యా ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశంలోని 14 రాష్ట్రాలలో గల ప్రముఖ విశ్వ విద్యాలయాలకు చెందిన సుమారు 442మంది ఫార్మసీ కళాశాలల ప్రొఫెసర్లతో పాటు ఆదిత్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, వైస్.ఛైర్మన్ సతీష్ రెడ్డి, ఫార్మసీ కళాశాలల డైరెక్టర్ డాక్టర్ కె. రవిశంకర్, ప్రిన్సిపాల్ డాక్టర్ వి. రవిశంకర్, కార్యక్రమం కోఆర్డినేటర్ డాక్టర్ డి. సతీష్ కుమార్, ఫార్మసీ కళాశాలల సిబ్బంది పాల్గొన్నారు.

 

ads