టిడిపితోనే సంక్షేమం, అభివృద్ధి

UPDATED 5th FEBRUARY 2019 TUESDAY 9:00 PM

సామర్లకోట: రాష్ట్రలో పేదల సంక్షేమం, అభ్యున్నతి టిడిపితోనే సాధ్యమని మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్  పేర్కొన్నారు. స్థానిక బళ్ళ మార్కెట్ సెంటర్ వద్ద అంబేద్కర్, జ్యోతిరావుపూలే విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం చర్మకారులు, డప్పు కళాకారులకు నూతనంగా మంజూరైన పింఛన్లను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు, మహిళలకు టిడిపి ప్రభుత్వం ఆర్ధికంగా రెట్టింపు భరోసాను అందించిందని, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు.       

 

ads