పిడుగుపడి ఇద్దరు వ్యవసాయ కూలీలు దుర్మరణం

పెద్దాపురం, సెప్టెంబరు 13: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో పిడుగుపాటుకు ఇద్దరు వ్యవసాయ కూలీలు ఆదివారం దుర్మరణం చెందారు. గ్రామానికి చెందిన వాడ్రేవు బాబురావు (50), కోలా వెంకట రమణ (45) అనే ఇద్దరు వ్యవసాయ కూలీలు కాండ్రకోట నుంచి జె. తిమ్మాపురం వెళ్లే రహదారిలో కుర్రా రాంబాబుకు చెందిన పంట పొలంలో వరి కలుపుతీత పని చేస్తుండగా అకస్మాత్తుగా భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అక్కడే పని చేసుకుంటున్న వీరు పిడుగుపాటుకు గురయ్యారు. ఇద్దరు కూలీలు అక్కడిక్కడే మృతి చెందారు.
ads