ప్రగతిలో విజేతలకు బహుమతి ప్రధానం

UPDATED 8th NOVEMBER 2019 FRIDAY 6:00 PM

గండేపల్లి(రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో పవర్ గ్రిడ్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో విజిలెన్స్ అవగాహనా వారోత్సవాలలో భాగంగా నిర్వహించిన వ్యాసరచన, డిబేట్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభుప్రసాద్, పవర్ గ్రిడ్ స్టేషన్ ఇన్ ఛార్జ్ కె. శంకరరావుల చేతుల మీదుగా శుక్రవారం బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరక్టర్ మేనేజ్ మెంట్ ఎం.వి. హరనాధబాబు, వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, వివిధ విభాగాల అధిపతులు, విద్యార్ధులు, తదితరులు పాల్గొన్నారు.

ads