భూములిచ్చిన రైతులకు నష్టపరిహారం చెల్లింపు

UPDATED 10th MAY 2019 FRIDAY 8:00 PM

పెద్దాపురం: ఏడీబీ రోడ్డు విస్తరణలో భాగంగా భూములిచ్చిన రైతులకు నష్ట పరిహారం క్రింద చెల్లించవలసిన నగదును పెద్దాపురం, రంగంపేట, గండేపల్లి రైతులు పెద్దాపురం ఆర్డీవో కార్యాలయానికి వచ్చి నగదును తీసుకోవలసిందిగా పెద్దాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎన్.ఎస్.వి.బి. వసంత రాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజానగరం నుంచి పెద్దాపురం పాండవుల మెట్ట వరకూ ఏడిబి రోడ్డు విస్తరణలో భూములిచ్చిన 614 మంది రైతులలో ఇంతవరకు 400 మంది రైతులు తమ నగదును తీసుకువెళ్లారని, మిగిలిన 214 మంది రైతులు వారి భూమి హక్కు నిర్ధారణ పత్రాలతో ఆర్డీవో కార్యాలయానికి వచ్చి నగదును తీసుకోవాల్సినదిగా ఆర్డీవో పేర్కొన్నారు. 

 

ads