ఘనంగా పై దినోత్సవం

UPDATED 14th MARCH 2019 THURSDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక అయోధ్యరామాపురంలోని బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో గణిత స్థిరాంకాలలో ముఖ్యమైన పై దినోత్సవాన్ని గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణ మాట్లాడుతూ గణిత స్థిరాంకాలలో కరణీయ సంఖ్య అయిన పై చాలా ముఖ్యమైనదని, ఈ సంఖ్య విలువ సుమారుగా 3.14159 అని, ఈ విలువ ఆధారంగానే ప్రతీ సంవత్సరం మార్చి నెల 14వ తేదీన 'పై' దినోత్సవాన్ని జరుపుకుంటారని అన్నారు. మ్యాథ్స్, సైన్స్, ఇంజీనీరింగ్ వంటి అనే శాస్త్రాలలో 'పై 'ను ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం విద్యార్థులకు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఏ.ఎల్.వి. కుమారి, కె.శ్రీనివాస్, కె. అరుణ, డివిఆర్ వల్లి, ఏ. శ్రీవల్లి, పిడి తాళ్లూరి వైకుంఠం, తదితరులు పాల్గొన్నారు.

ads