జగనన్న ఆసరా రూ. నాలుగు కోట్లు: ఎంపీడీవో జాన్ మిల్టన్

గంగవరం: 11 సెప్టెంబర్ 2020(రెడ్ బీ న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి జాన్ మిల్టన్ అన్నారు. స్థానిక విలేఖరులతో ఆయన శుక్రవారం మాట్లాడారు. మండలంలో మంజూరైన ప్రభుత్వ పథకాలు వివరించారు. జగనన్న ఆసరా పథకానికి సుమారు రూ. నాలుగు కోట్ల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. జగనన్న తోడు పథకం 178 మందికి ఎంపిక చేయడం జరిగింది. ఇప్పటివరకు వైయస్సార్ చేయూత పథకానికి పథకానికి 1260 ధరఖాస్తులు నమోదు చేయడం జరిగిందని, 628 మందికి అటవీ హక్కుల హక్కు పత్రాలు సిద్ధం చేయడం జరుగుతుందన్నారు.
ads