కన్నబాబుపై చినరాజప్ప ఫైర్

రాజమహేంద్రవరం,31 డిసెంబర్ 2020(రెడ్ బీ న్యూస్): మంత్రి కన్నబాబుపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష నేతలను తిట్టడమే మంత్రి కన్నబాబు పని అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్‌ మెప్పుకోసం ప్రతిపక్షాలను తిడుతూ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. కన్నబాబు చరిత్ర అందరికీ తెలుసు అని పేర్కొన్నారు. గంటకో మాట మార్చే కన్నబాబుకు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను విమర్శించే హక్కు లేదని హెచ్చరించారు. వైసీపీ పాలనలో 796 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని.. రైతు సమస్యలను ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు. సకాలంలో నష్టపరిహారం అందక రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. రైతు సమస్యలు పరిష్కరించే వరకు టీడీపీ పోరాడుతుందని చినరాజప్ప పేర్కొన్నారు
ads