తహసీల్దారుకు ఘన వీడ్కోలు

UPDATED 9th JULY 2019 TUESDAY 9:00 PM

సామర్లకోట: సార్వత్రిక ఎన్నికల విధుల్లో భాగంగా సామర్లకోట తహసీల్దారుగా భాద్యతలు నిర్వర్తించిన సిహెచ్ నరసింహారావు బదిలీ అయిన సందర్భంగా మంగళవారం స్థానిక  తహసీల్దార్ కార్యాలయంలో కార్యాలయ సిబ్బంది, మండల పరిధిలోని రెవిన్యూ సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనను దుశ్శాలువాలు, పూలమాలలు, జ్ఞాపికలతో సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ ఎన్ఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ విధి నిర్వహణలో నరసింహారావు ప్రజలకు అందించిన సేవలు మరువలేనివని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో కర్రి స్వప్న, ఈఓపీఆర్డీ సిహెచ్ జగ్గారావు, మండల విద్యాశాఖాధికారి  వైవి శివరామకృష్ణయ్య,  ఆర్ఐ ఎం. రాజేష్, సర్వేయర్ లక్ష్మణరావు, విఆర్వోలు ఏడిద భరత్, వల్లి, తమన్నా, జ్యోతుల సూరిబాబు, హరి, తదితరులు పాల్గొన్నారు. 

ads