పోలియో రహిత సమాజాన్ని నిర్మించుకోవాలి

UPDATED 10th MARCH 2019 SUNDAY 9:00 PM

సామర్లకోట: పోలియో రహిత సమాజం నిర్మాణం కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని జిల్లా మానవ హక్కుల పరిరక్షణా సంఘం అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ అన్నారు. సామర్లకోట పట్టణంలో అన్ని ముఖ్య కూడళ్ల వద్ద ఆదివారం నిర్వహించిన పల్స్ పొలియో కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక విలేఖరులతో ఆయన మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మనదేశం ఇదివరకే పోలియో రహిత దేశంగా ప్రకటించినప్పటికి ఈ వ్యాధి ఇతర దేశాల నుంచి సోకకుండా ఉండటానికి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జుత్తుక రాజు, కుంచే నానిబాబు, అంగన్ వాడీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ads