జలగణన నివేదికపై ఆర్డీవో సమీక్ష

UPDATED 10th JULY 2019 WEDNESDAY 5:30 PM

పెద్దాపురం: 2017-18 సంవత్సరానికి సంబంధించి పెద్దాపురం డివిజన్ పరిధిలో చేపట్టిన ఆరవ చిన్నతరహా నీటి వనరుల, భూగర్భ జల గణన నివేదిక అంశాలపై ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంత రాయుడు సమీక్షా సమావేశం బుధవారం నిర్వహించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో గణన శాఖ డిప్యూటీ డైరెక్టర్ పి. బాలాజీ, డివైఎస్ఓ శ్యామల, డివిజన్ పరిధిలోగల మండల సహాయ గణాంక అధికారులతో గ్రామాల వారీగా ఇంతవరకు గణాంకాలు చేపట్టిన వ్యవసాయ బోర్లు, చేపల చెరువులు, పంచాయతీ చెరువులు తదితర అంశాల ప్రగతి నివేదికను ఆర్డీవో సమీక్షించారు. పెద్దాపురం డివిజన్ పరిధిలో తుని, ఏలేశ్వరంలలో సర్వే వెనుకబడి ఉందని, దీనిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్డీవో ఆదేశించారు. అనంతరం డిప్యూటీ డైరెక్టర్ పి. బాలాజీ, డివైఎస్ఓ శ్యామల అధ్యక్షతన మండల సహాయ అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. 

 

ads