భీమేశ్వరస్వామి ఆలయం మూసివేత

UPDATED 20th MARCH 2020 FRIDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): ప్రముఖ పంచారామ క్షేత్రం శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయాన్ని కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఈనెల 31వ తేదీ వరకు మూసివేయాలని  దేవాదాయ శాఖ నుంచి  ఉత్తుర్వులు అందాయని దేవస్థానం కార్యనిర్వహణాధికారి పులి నారాయణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక విలేఖరులతో శుక్రవారం ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా కేంద్ర ఆరోగ్యశాఖ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భక్తులకు దర్శనాలు నిలిపివేసి ఆలయాన్ని మూసివేసినట్లు తెలిపారు. ఆలయంలో స్వామి, అమ్మవార్లకు జరగాల్సిన రోజువారీ పూజలు, అభిషేకాలు ఆలయ పండితులు, అర్చకులు మాత్రమే నిర్వహిస్తారని, భక్తులు దర్శనానికి అనుమతి లేదని అన్నారు. భక్తులు ఈ విషయం గమనించి కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా సహకరించాలని ఆయన కోరారు.

ads