మే 16న నవోదయ పరీక్ష

UPDATED 15th APRIL 2021 THURSDAY 8:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): జవహర్ నవోదయ విద్యాలయలో 2021-22 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశానికి జిల్లా వ్యాప్తంగా 5371 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారని పాఠశాల ప్రిన్సిపాల్ జంధ్యాల వెంకటరమణ తెలిపారు. వచ్చే నెల 16వ తేదీన  జిల్లా వ్యాప్తంగా 39 పరీక్షా కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష జరుగుతుందని, దీనికి సంబంధించి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చునని చెప్పారు. అభ్యర్థులు తమ రిజిస్టర్ నంబర్‌ను యూజర్ ఐడీగా, అలాగే పుట్టిన తేదీని పాస్ వర్డ్ గా వినియోగించాలన్నారు. navodaya.gov.in, cbseitms.nic.in వెబ్ సైట్ ద్వారా డౌన్ లోడ్  చేసుకోవచ్చని ఆయన తెలిపారు.

ads