బాల్య వివాహాలు అరికట్టేందుకు కృషి చేయాలి

* ఎంపీడీవో జాన్ మిల్టన్

UPDATED 30th JUNE 2020 TUESDAY 7:00 PM

గంగవరం(రెడ్ బీ న్యూస్): బాల్య వివాహాలు జరగకుండా అరికట్టేందుకు గ్రామ సచివాలయ, అంగన్వాడీ సిబ్బంది కృషి చేయాలని ఎంపీడీవో జాన్ మిల్టన్ అన్నారు. సీడీపీవో నీలవేణి ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో బాల్య వివాహాలు, టీనేజ్ ప్రెగ్నెన్సీ బాల్య వివాహాల నిరోధక కమిటీ ఏర్పాటుపై మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీవో మాట్లాడుతూ బాల్య వివాహాలు అరికట్టడంలో అంగన్వాడీ సిబ్బంది, మహిళా సంరక్షణ కార్యదర్శులు, గ్రామ మహిళా పోలీసులు తగిన కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఎంఈవో మల్లేశ్వరరావు, అదనపు ఎస్సై రాము, పంచాయతీరాజ్ విస్తరణాధికారి కృష్ణ, గ్రామ సచివాలయ, ఐసిడిఎస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

 

ads