మద్యం దుకాణం ఏర్పాటు తగదు

UPDATED 9th SEPTEMBER 2019 MONDAY 9:00 PM

సామర్లకోట (రెడ్ బీ న్యూస్) : సామర్లకోట పట్టణంలో స్థానిక బళ్ళ మార్కెట్ సెంటర్ లో ప్రభుత్వం కొత్తగా మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దని మాదిగ మహాజన సంఘం (ఎంఎంజెఎస్) జిల్లా అధ్యక్షుడు కాపవరపు కుమార్ ఆధ్వర్యంలో సంఘం సభ్యులు జిల్లా కలెక్టరుకు సోమవారం వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఎంఎంజెఎస్ అధ్యక్షుడు కాపవరపు కుమార్ మాట్లాడుతూ బళ్ళ మార్కెట్ సెంటర్ లో పాఠశాల, గ్రంథాలయం, దేవాలయంతో పాటు అనేక మంది నిరుపేద కుటుంబాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారని, మద్యం దుకాణాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎంజెఎస్ నాయకులు గంధం చిన్నబ్బాయి, ఉప్పాడ అప్పారావు, ఇండుగపల్లి బేబి, సవరం శరావతి, శ్రీమంతుల మరియమ్మ, సిహెచ్ కొండలరావు, తదితరులు పాల్గొన్నారు.

 

ads