వైభవంగా చింతాలమ్మ విగ్రహ ప్రతిష్ట

UPDATED 6th FEBRUARY 2019 WEDNESDAY 7:00 PM

పెద్దాపురం: పెద్దాపురం మండలం సిరివాడ గ్రామంలో చింతాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ హిందూ సాంప్రదాయంలో గ్రామదేవతలను పూజించే ఆచారం అనాదిగా వస్తుందని, గ్రామదేవతలను ఆరాధించడం ద్వారా ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తారని అన్నారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు  స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు కమ్మిల సుబ్బారావు, సామర్లకోట ఏఎంసి చైర్మన్ పాలకుర్తి శ్రీనివాసాచార్యులు (శ్రీనుబాబు), ఎంపిడివో పి. వసంతమాధవి, ఏపిఎం ఎస్. వేదకుమారి, ఆలయ పాలకమండలి సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 

ads