అహర్నిశలు శ్రమిస్తే విజయం తథ్యం

* సోలో బ్రతుకే సో బెటర్ సినీ డైరెక్టర్ సుబ్బు 
* ఆన్ లైన్ లో శ్రీప్రకాష్ విద్యార్థులతో ముఖాముఖి

UPDATED 3rd JANUARY 2021 SUNDAY 8:00 PM

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): మనం ఏరంగంలో రాణించాలన్నా అహర్నిశలు శ్రమించినపుడే  విజయం తధ్యమని సోలో బ్రతుకే సో బెటర్ సినిమా దర్శకుడు సుబ్రహ్మణం (సుబ్బు) పేర్కొన్నారు. స్థానిక రామారావు పేటలో గల శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ఆన్ లైన్ ద్వారా విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను శ్రీ ప్రకాష్ విద్యానికేతన్ (తుని)లో పదవ తరగతి, శ్రీ ప్రకాష్ జూనియర్ కళాశాల (పాయకరావుపేట)లో ఇంటర్ పూర్తి చేసానని అన్నారు. అలాగే శ్రీప్రకాష్ విద్యా సంస్థలలో నిర్వహించిన అనేక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నానని, తద్వారా దర్శకత్వం వైపు వెళ్ళాలనే ఆలోచన వచ్చిందని తెలిపారు. శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల డైరెక్టర్ విజయప్రకాష్ తనకు ఎన్నోవిధాల సహాయసహకారాలు అందించారని ఆయన తెలిపారు. శ్రీప్రకాష్ సినర్జీ పాఠశాల డైరక్టర్ సిహెచ్ విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ తమ విద్యా సంస్థలో విద్యను అభ్యసించిన విద్యార్థి ఈస్థాయికి రావడం ఎంతో గర్వకారణమని అన్నారు. సినిమా అనేది కమర్షియల్ గానే కాకుండా ఉన్నత విలువలతో ఉండాలనే ఆశయంతో సినీ రంగంలోకి వచ్చిన సుబ్బును ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో  సీనియర్ ప్రిన్సిపాల్ యమ్.వి.వి.యస్.మూర్తి, డాక్టర్ వీర్రాజు, భానుమూర్తి, బంగారురాజు, అకడమిక్, కల్చరల్ కోఆర్డినేటర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

 

 

 

ads