వైఎస్సార్ చేయూతతో ఆర్థిక అభివృద్ధి

గంగవరం:15 సెప్టెంబరు 20220(రెడ్ బీ న్యూస్): వైయస్సార్ చేయూత పథకం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని వైసీపీ మండల కమిటీ అధ్యక్షుడు అప్పలరాజు, మహిళా కమిటీ అధ్యక్షురాలు బేబీ రత్నం అన్నారు. గంగవరంలో వైయస్సార్ చేయూత పథకం లో అందిన ఆర్థిక సహాయం, బ్యాంకు రుణం ద్వారా ఏర్పాటుచేసిన జనరల్ స్టోర్ ను వెలుగు ఏపీఎం సత్య ప్రసాద్ తో కలిసి వారు మంగళవారం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేయూత పథకం ద్వారా అందిన సహాయంతో పాటు బ్యాంక్ లింక్ రుణాల ద్వారా రుణాలు ఇప్పించి కార్పొరేట్ కంపెనీల ద్వారా సరుకులను ఇప్పించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం అందించే సహాయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చేయూత పథకం ద్వారా లబ్ధి పొందిన వారిలో 62 మంది కిరాణా జనరల్ స్టోర్ లో ఏర్పాటుకు ముందుకు వచ్చారని, అలాంటివారు ఈ నెలాఖరు నాటికి ప్రారంభోత్సవాలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బుల్లెమ్మ, మాజీ సర్పంచ్ అక్కమ్మ వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.
ads