ఉచిత హోమియో మందులు పంపిణీ

UPDATED 21st MARCH 2020 SATURDAY 5:30 PM IST

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): జిల్లా ఆయుష్ శాఖ, రిలయన్స్ ఫౌండేషన్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మండల పరిధిలోని గోరింట గ్రామంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు శనివారం ఉచితంగా హోమియో మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వ హోమియో వైద్యులు డాక్టర్ కృష్ణ మోహన్ మాట్లాడుతూ కరోనా వ్యాధి లక్షణాలు ఏర్పడితే దాచుకోకుండా వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. జలుబు, దగ్గు ఉన్న వారికి దూరంగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని, కరచాలనం చేయడం తగ్గించాలని, చేతులను తరుచూ సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని ఆయన సూచించారు. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడం మన అందరి బాధ్యతని, ఈ హోమియో మందును క్రమం తప్పకుండా మూడురోజులు పాటు వేసుకోవాలని ఆయన తెలిపారు. అనంతరం గ్రామంలో ఇంటింటికి పర్యటించి హోమియో మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ బర్రే నాగేశ్వరావు, సిబ్బంది ఎ. నాగరాజు, వాలంటీర్లు, బర్రే రామగోవిందు, కర్రి వీర్రాఘవులు, తదితరులు పాల్గొన్నారు.                  

ads