నవశకం సర్వేకు ప్రజలు సహకరించాలి

* పెద్దాపురం ఆర్డీవో ఎస్.మల్లిబాబు  

UPDATED 28th NOVEMBER 2019 THURSDAY 5:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నవశకం సర్వేకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని పెద్దాపురం ఆర్డీవో ఎస్. మల్లిబాబు అన్నారు. పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో స్థానిక విలేఖరులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆర్డీవో మల్లిబాబు మాట్లాడుతూ పెద్దాపురం డివిజన్ పరిధిలో నవశకం కార్యక్రమానికి సంబంధించి వాలంటీర్లలతో సర్వే నిర్వహించడం జరుగుతుందని, వాలంటీర్లు ప్రతీ ఇంటికి వచ్చి సర్వే చేస్తారని, వారికి పూర్తి సమాచారం అందించాలని అన్నారు. ప్రస్తుతం తెల్ల రేషన్ కార్డు ద్వారా ప్రభుత్వ పథకాలు అందజేయడం జరుగుతుందని, ఇప్పుడు లబ్ధిదారుల అర్హతను నిర్ణయించేందుకు రేషన్ కార్డు ఆధారం లేకుండా బియ్యం కార్డు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు, వైయస్సార్ పింఛన్ కార్డులను వేరువేరుగా అందచేస్తారని తెలిపారు. విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసంత దీవెన కార్యక్రమాలకు సంబంధించి అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులు వాలంటీర్లకు అందజేయాలని తెలిపారు. అలలాగే కిడ్నీ, బ్లడ్ క్యాన్సర్, బోదకాలు తదితర దీర్ఘకాల వ్యాధులకు రూ.5 నుంచి పదివేలు వరకు ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని,.గతంలో కంటే ఆర్థిక పరిమితి పెంచడం వల్ల  ఎక్కువ మంది పథకాలకు అర్హతలు కలిగి ఉంటారని చెప్పారు. కాపు నేస్తం, అర్చకులు, ఇమాంలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుందని, దీనికి సంబంధించిన అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. 

ads