ఘనంగా మరిడమ్మ జన్మ నక్షత్ర పూజలు

UPDATED 13th OCTOBER 2020 TUESDAY 6:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో వేంచేసివున్న మరిడమ్మ దేవస్థానంలో అమ్మవారి జన్మ నక్షత్రం మఖ పురస్కరించుకుని మంగళవారం అమ్మవారికి శాస్త్రోక్తంగా పంచామృతాభిషేకం, కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. వేద పండితులు చిట్టెం హరిగోపాలశర్మ పర్యవేక్షణలో కోవిడ్  నిబంధనల పాటిస్తూ భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ గావించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ కె. విజయలక్ష్మి, వేద పండితులు, తదితరులు పాల్గొన్నారు.

ads