ప్రారంభోత్సవం లేకుండానే సమావేశాలా...!

* రెవిన్యూ అధికారుల అత్యుత్సాహం
* నూతన ఆర్డీవో కార్యాలయంలో అధికారిక సమావేశం  
* ప్రజాప్రతినిధులకు అవమానం

UPDATED 29th AUGUST 2021 SUNDAY 10:00 PM

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): పెద్దాపురం పట్టణంలో నూతనంగా నిర్మించిన ఆర్డీవో కార్యాలయ భవనంలో రెవెన్యూ అధికారులు అత్యుత్సాహంతో అధికారిక సమావేశం నిర్వహించడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా ప్రతినిధులెవ్వరూ ఆప్రభుత్వ భవనాన్ని అధికారికంగా ప్రారంభించలేదు. వారితో పనేముంది అనుకున్నారో ఏమో రెవెన్యూ అధికారులు మాత్రం ఆభవనంలో ఆదివారం డివిజన్ స్థాయి అధికారిక సమావేశం నిర్వహించేశారు. 2018వ సంవత్సరంలో సుమారు రూ. కోటి వ్యయంతో నిర్మించిన ఈ కార్యాలయ భవనం సార్వత్రిక ఎన్నికల కారణంగా కోడ్ అమలులో ఉండడంతో దాన్ని ప్రారంభించేందుకు వీలు కాలేదు. ఎన్నికల అనంతరం అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం దానిని అధికారికంగా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ నూతన కార్యాలయం భవనంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ, ఆర్డీవో మల్లిబాబు ఆధ్వర్యంలో రెవిన్యూ అధికారులతో డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించారు. నిజానికి ఈభవనాన్ని రాష్ట్ర రెవిన్యూ మంత్రి ప్రారంభించాల్సి ఉంది. అయితే సాక్షాత్తు మంత్రిని సైతం కాదని ముందుగానే రెవెన్యూ అధికారులు ఇలా అధికారిక సమావేశాలు నిర్వహించడంపై అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us