ఫైలేరియా నిర్మూలనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి

UPDATED 10th FEBRUARY 2020 MONDAY 7:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): ఫైలేరియా వ్యాధి నిర్మూలకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దవులూరి సుబ్బారావు పేర్కొన్నారు. జాతీయ ఫైలేరియా నివారణా దినోత్సవం సందర్భంగా స్థానిక పాత ప్రభుత్వ ఆసుపత్రిలో గల ఫైలేరియా కంట్రోల్ యూనిట్ లో హెల్త్ ఇనస్పెక్టర్ పి. రామారావు అధ్యక్షతన డిఈసి, ఆల్ బెండాజోల్ మాత్రలు పంపిణీ కార్యక్రమం సోమవారం ఉదయం చేపట్టారు. ఈ సందర్భంగా దవులూరి సుబ్బారావు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, పరిసరాల పరిశుభ్రతతోనే ఫైలేరియా వ్యాధి నివారణ సాధ్యపడుతుందని తెలిపారు. ఎప్పటికప్పుడు వైద్యాధికారుల పర్యవేక్షణలో వారిచ్చే ఆరోగ్య సూచనలు అనుసరించాలని ఆయన సూచించారు. అనంతరం డిఈసీ మాత్రలను మింగించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నెక్కంటి సాయిప్రసాద్, కనకాల సుబ్రహ్మణ్యేశ్వరావు, విజ్జపు రాజశేఖర్, పెదిరెడ్ల రామకృష్ణ, మామిడి ఈశ్వరరావు, జానీ, కింతాడ పద్మ, వాసంశెట్టి గంగ, మున్సిపల్ కమీషనర్ జి. శేఖర్, సి.హెచ్.సి వైద్యాధికారి డాక్టర్ పృద్వి చరణ్, ఫైలేరియా ఫీల్డ్ సూపర్ వైజర్ కె. వీరబాబు, తదితరులు పాల్గొన్నారు.                  

ads