వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి

UPDATED 14th MARCH 2019 THURSDAY 9:00 PM

సామర్లకోట: వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ నీరజ అన్నారు. సామర్లకోట మండలం హుస్సేన్ పురం గ్రామంలో గల ప్రభుత్వ, అంగన్వాడీ పాఠశాలల విద్యార్థులకు వడదెబ్బ తగలకుండా వ్యాధి నిరోధక హోమియో మాత్రలను పెదబ్రహ్మదేవం ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ నీరజ గురువారం పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్ నీరజ మాట్లాడుతూ చిన్న పిల్లలు, వృద్ధులు ఎండలోకి బయటకు వెళ్లడం ఆరోగ్యానికి మంచిది కాదని, వాతావరణం చల్లబడితే గానీ బయటకు వెళ్లరాదని అన్నారు. ప్రతీ అరగంటకు ఒకసారి నీళ్లు తిరగాలని, అలాగే వదులుగా ఉండే కాటన్‌ దుస్తులు ధరించడంతో శరీరానికి గాలి తగిలి డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండొచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఫ్.యన్.వో వి. అమ్మాణీ, అంగన్వాడి టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.

ads