వైభవంగా త్రిశూల స్నాన పూజలు

UPDATED 6th MARCH 2019 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: ప్రసిద్ధ పంచారామ క్షేత్రం శ్రీ కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా బుదవారం స్వామి, అమ్మవార్లకు త్రిశూల స్నాన పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయం నుంచి పల్లకిలో ఊరేగింపుగా త్రిశూలాన్ని పవిత్ర పుష్కరిణి వద్దకు వేదమంత్రాలు, మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తీసుకుని వచ్చారు. స్వామివారి కల్యాణానికి దీక్షాధారణ చేసిన భీమన్న దంపతులు త్రిశూల స్నానం ప్రారంభించారు. భక్తుల శివనామ స్మరణలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహనరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఈవో పులి నారాయణమూర్తి, వేదపండితులు వేమూరి సోమేశ్వరశర్మ, సన్నిధిరాజు, కొంతేటి జోగారావు, శ్రీపాద రాజశేఖర్, అర్జున్, అంజిబాబు, చెరుకూరి రాంబాబు పాల్గొన్నారు. గురువారం స్వామివారి శ్రీ పుష్పయాగ మహోత్సవంతో మహాశివరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి.

 

ads