సత్యసాయి సేవాసమితి ధాతృత్వం

గంగవరం,3 మే 2020(రెడ్ బీ న్యూస్): అడ్డతీగల భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలో లోతట్టు గిరిజన గ్రామాలైన తీటుకురాళ్ళు, పి.గంగవరం గ్రామాల్లో గిరిజన కుటుంబాలకు నిత్యవసర వస్తువులు, అరటి పండ్లు, మాస్కులు, దుస్తులను ఆదివారం పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి సేవకులు గిరిజనులకు ఆరోగ్య సూత్రాలు వివరించారు. ఈవ్యాధి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పరిశుభ్రత పాటించాలని, మాస్కులు ధరించాలని అలాగే ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని సూచించారు. సబ్బుతో చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలని సూచించారు.
ads