రైతన్న సంతోషమే ప్రభుత్వ ధ్యేయం

UPDATED 8th JULY 2019 MONDAY 8:00 PM

పెద్దాపురం: ప్రతీ రైతు సంతోషంగా ఉండాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు తోట వాణి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి  డాక్టర్ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని స్థానిక రాజుగారి వీధిలో గల ఆర్యవైశ్య కల్యాణ మండపంలో ఏడిఏ ఎం. రత్నప్రశాంతి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన రైతు దినోత్సవం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం రైతులను ఉద్దేశించి తోట వాణి మాట్లాడుతూ రైతే రాజుగా, వ్యవసాయ ప్రగతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రమిస్తోందని, వైఎస్‌ వ్యవసాయంలో అనూహ్యమైన మార్పులు తీసుకొచ్చి రైతు బాంధువుడిలా నిలిచారని కొనియాడారు. ఆ మహానేత అడుగుజాడల్లో రైతులకు మంచి చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ ముందుకు వెళ్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలంతా కలలు కన్న వైఎస్సార్‌ పాలన ప్రారంభమైందని, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజల మనసుల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక  ప్రాధాన్యమిస్తోందని, వైఎస్సార్‌ ఆశయ సాధన కోసమే ఆయన జయంతి స్మృతిగా రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవం నిర్వహిస్తోందని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ అవినీతి రహిత పాలన అందించాలని ఆమె అధికారులకు సూచించారు. అనంతరం ఉత్తమ రైతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు నెక్కంటి సాయిప్రసాద్, తాడి రాజశేఖర్, ముప్పన వీర్రాజు, కనకాల సుబ్రహ్మణ్యేశ్వరరావు, కాపగంటి కామేశ్వరావు, కొత్త వీరన్న, ఆర్డీవో, మున్సిపల్ ప్రత్యేకాధికారి ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు, ఆత్మా చైర్మన్ కలకపల్లి రాంబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, బయో కంట్రోల్ ఏడిఏ స్వాతి, ఏవోలు కొల్లి ద్వారకాదేవి, శామ్యూల్ జాన్, వెటర్నరీ ఎడి డాక్టర్ శ్రీనివాసరావు, ఏపిఎంఐపి ఏరియా ఇంఛార్జ్ చిలకమ్మ, ఏఈవో ఎన్.వి.వి. ప్రసాద్, ఎంపీఈవోలు, తదితరులు పాల్గొన్నారు.                       

ads