ఆదిత్యలో ఘనంగా జాతీయ యువజనోత్సవం

UPDATED 12th JANUARY 2021 TUESDAY 11:30 AM

గండేపల్లి (రెడ్ బీ న్యూస్):  గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలల గ్రంధాలయ విభాగం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 158వ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి  ముఖ్య అతిథిగా పాల్గొని వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ సమాజ హితం కోసం పాటుపడిన వారందరూ మహానుభావులే అని, అందులో కొందరే మహర్షులవుతారని అలాంటే వ్యక్తే స్వామి వివేకానందని అన్నారు. శ్రీరామకృష్ణ పరమహంసకు ప్రియ శిష్యుడైన వివేకానంద హిందూమతం పునరుజ్జీవనంలో ప్రధాన భూమిక పోషించారని, ప్రపంచానికి భారతీయ వేదాంతం, ఆధ్యాత్మికత, యోగా, తత్వాలను పరిచయం చేయడంలో ఆయన  ఎంతో కీలకపాత్ర పోషించారని తెలిపారు. ఆయన ఒక గొప్ప నాయకుడని, అంతేకాకుండా ఆయన ఉపన్యాసాలు, అక్షరాలు, ఆలోచనలు మహాత్మా గాంధీ నుంచి నేటి మోడీ వంటి మహా నాయకులనే కాకుండా సామాన్య ప్రజలకు ఎందరికో స్ఫూర్తినింపాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్  డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, డీన్ స్టూడెంట్స్ ఎఫైర్స్  ప్రొఫెసర్ జె.డి. వెంకటేష్, ఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ వి. సత్యనారాయణ, గ్రంధాలయ విభాగాధిపతి కె. అశోక్ కుమార్, పెదబ్రహ్మదేవం శ్రీ శారదా రామకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు తోటకూర గంగాధర్, గ్రంధాలయ సిబ్బంది నాగబాబు, ఆర్.సి.రెడ్డి, సి.హెచ్.ఎస్.స్వామి, తదితరులు పాల్గొన్నారు.

 

ads