కరోనాను జయించిన పోలీస్ సిబ్బందికి సత్కారం

సామర్లకోట:10 సెప్టెంబరు 2020(రెడ్ బీ న్యూస్): సామర్లకోట పోలీస్ స్టేషన్ లో పనిచేస్తూ కరోనా వారియర్స్ గా విశేష సేవలందిస్తూ ఇటీవల నలుగురు సిబ్బంది కరోనా బారిన పడ్డారు. వీరందరూ హోం ఐసోలేషన్ లో చికిత్స పొంది గురువారం నిర్వహించిన కొవిడ్ పరీక్షలలో నెగటివ్ గా నిర్ధారణ అయ్యింది. అనంతరం వారు విధులకు హాజరు కావడంతో ఎస్.ఐ సుమంత్ ఆధ్వర్యంలో పూలవర్షంతో స్వాగతం పలికి శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కరోనాను జయించిన సిబ్బంది మహిళా హెడ్ కానిస్టేబుల్ చక్రవేణి, రాంబాబు, గోపి, శ్రీను మాట్లాడుతూ..కొవిడ్ బారిన పడిన వారు ఎటువంటి భయాందోళన చెందకుండా వైద్యుల సలహాలు పాటించాలని, వ్యాయామం తప్పనిసరిగా చేయాలన్నారు. ఇంతటి అభిమానం ఆదరణ కనబరిచిన ఎస్ఇ సుమంత్, తోటి సిబ్బందికి సన్మాన గ్రహీతలు కృతజ్ఞతలు తెలిపారు.
ads