వైభవంగా పంచామృతాభిషేకం

UPDATED 9th JUNE 2019 SUNDAY 7:00 PM

పెద్దాపురం: పెద్దాపురం పట్టణంలో వేంచేసిఉన్న మరిడమ్మ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి జన్మ నక్షత్రం మఖను పురస్కరించుకుని ఆదివారం పంచామృతాభిషేకం వైభవంగా నిర్వహించారు. దేవస్థానం వేద పండితులు చిట్టెం హరిగోపాలశర్మ ఆధ్వర్యంలో పవిత్ర మంత్రోచ్ఛారణల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ కె. విజయలక్ష్మి, వేదపండితులు ఐవి ప్రసాద్ శర్మ, ఎన్.వి.శాస్త్రి, అవధాని, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు..        

ads