భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు

UPDATED 18th NOVEMBER 2020 WEDNESDAY 7:00 PM

గండేపల్లి (రెడ్ బీ న్యూస్): దీపావళి తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చవితి రోజున నాగుల చవితి పర్వదినాన్ని బుధవారం అత్యంత భక్తిశ్రద్ధలతో కుటుంబ సమేతంగా జరుపుకొన్నారు. గ్రామాలు, పట్టణాల్లో పెద్దలు, పిల్లలు ఉదయాన్నే దగ్గర్లో ఉన్న పుట్ట వద్దకు వెళ్లి పుట్టను పూలతో అలంకరించి పాలుపోసి పసుపు, కుంకుమలు చల్లి, నూతన వస్త్రాలు, పూజా సామగ్రి పెట్టి ప్రదక్షిణలు చేశారు. చలిమిడి, కోడిగుడ్లు, అరటిపళ్లు, నాగరాజుకు నైవేద్యంగా సమర్పించి పూజించారు. పుట్టమట్టిని బొట్టుగా పెట్టుకుని మమ్మల్ని కాపాడు అంటూ వేడుకుని టపాసులు కాల్చారు.

ads