నాడు-నేడు పనులను నాణ్యతగా నిర్వహించాలి

* ఎంపీడీవో అబ్బిరెడ్డి రమణారెడ్డి
* సచివాలయ సిబ్బందితో సమీక్షా సమావేశం

UPDATED 29th JUNE 2020 MONDAY 6:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): పెద్దాపురం మండల పరిధిలో నిర్వహించే నాడు-నేడు పనులను అత్యంత నాణ్యతగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బందిని ఎంపీడీవో అబ్బిరెడ్డి రమణారెడ్డి ఆదేశించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎంపీడీవో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా కృషి చేయాలని, పాఠశాలల ఆధునీకీకరణ పనులు నాణ్యతో ఉండేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో పారిశుధ్య పనులను మరింత మెరుగుపర్చాలని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయాల నిర్వహణపై కార్యదర్శులు చురుకైన పాత్ర పోషించాలని పేర్కొన్నారు. అలాగే వ్యక్తిగత మరుగుదొడ్లు, పారిశుధ్యం, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు నిర్మాణాల తీరు, ఉపాధి పనులతో పాటు పలు అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ కరక హిమ మహేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

ads