మహానేతకు ఘన నివాళులు

UPDATED 8th JULY 2019 MONDAY 9:00 PM

సామర్లకోట: దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 70వ జయంతి వేడుకలు సామర్లకోట పట్టణ, మండల పరిధిలోని గ్రామాల్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక రాజీవ్ గృహకల్ప వద్ద గల రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు తోట వాణి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి, కేక్ కట్ చేసి, స్వీట్స్ పంచారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చేసిన ఘనత రాజశేఖర్‌రెడ్డిదేనని, తర్వాత ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికే పరిపాలనా దక్షత కలిగి ఉందన్నారు. ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్న జగన్‌ నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు. అనంతరం మండల పరిధిలోని మాధవపట్నం, వికెరాయపురం, పనసపాడు, గొంచాల, నవర, పి.వేమవరం, అచ్చంపేట, తదితర గ్రామాల్లో పెన్షన్లు, అలాగే రాజన్న బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులకు సైకిళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు ఆవాల లక్ష్మీనారాయణ, కాళ్ల లక్ష్మీనారాయణ, కాటూరు జానకిరామయ్య, యార్లగడ్డ జగదీష్, గుణ్ణం రాజబ్బాయి, పుట్టా సూరిబాబు, సేపేని సురేష్, మేకా శ్రీను, శెట్టిబత్తుల దుర్గ, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ads