సామర్లకోటలో కరోనా పాజిటీవ్ కేసు నమోదు

సామర్లకోట, 23 ఏప్రిల్ 2020 ( రెడ్ బీ న్యూస్):సామర్లకోట కోలావారి వీధిలో కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యింది. దీంతో పట్టణ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. హుటాహుటిన అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు.అలాగే మునిసిపల్, పోలీసు అధికారులు పరిసర ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. భాదితుడు మర్కజ్ వెళ్లొచ్చిన నేపథ్యంలో గత నెల 24 వ తేదీన నిర్వహించిన కరోన పరీక్షలలో నెగిటివ్ వచ్చింది. దీంతో హోమ్ క్వారంటైన్ ఉండాలని అధికారులు సూచించారు.తిరిగి ఈనెల 22న కరోన టెస్టు చేయగా పాజిటివ్ రిపోర్ట్ రావడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్ సెంటర్ కు అధికారులు తరలించారు. ఇదిలా ఉండగా పాజిటివ్ పేషెంట్ కు కాంటాక్ట్ లో ఉన్న 16 మందిని క్వారంటైన్కు తరలించి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే బాధితుడి ఇంటి నుంచి 500 మీటర్లు పరిధిని రెడ్ జోన్ గా అధికారులు ప్రకటించారు.
ads