పొలంబడి సద్వినియోగం చేసుకోవాలి

* కాకినాడ ఎడిఎ జి.వి.పద్మశ్రీ

UPDATED 19th MARCH 2020 THURSDAY 8:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ ఎడిఎ జి.వి.పద్మశ్రీ  పేర్కొన్నారు. మండల వ్యవసాయాధికారిణి ఐ. సత్య ఆధ్వర్యంలో మండల పరిధిలోని ఉండూరు గ్రామంలో గురువారం నిర్వహించిన పొలంబడి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. విత్తనం నాటిననాటి నుంచి పంట కోత దశకు వచ్చేవరకు చేయాల్సిన యాజమాన్య పద్ధతులు గురించి తెలియచేసి, విత్తన ఎంపిక, రకాలు, మొలకశాతం, విత్తనశుద్ది  చేసే విధానాన్ని ప్రయోగాత్మకంగా చేయించారు. రైతులు సమగ్ర పంట యాజమాన్య పద్ధతులు పాటించాలని, విచక్షణారహితంగా రసాయన ఎరువులు ఉపయోగించకుండా సేంద్రియ ఎరువులు వినియోగించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారి ఎం.వి. సతీష్, విఏఏ తేజ, తదితరులు పాల్గొన్నారు.  

  

ads