సత్యదేవుని కల్యాణానికి పట్టువస్త్రాలు బహూకరణ

UPDATED 12th MAY 2019 SUNDAY 9:00 PM

అన్నవరం: అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం సందర్భంగా స్వామి, అమ్మవార్లకు ఆదివారం ఒక భక్తుడు పట్టు వస్త్రాలను సమర్పించారు. కడప జిల్లా కాజీపేటకు చెందిన కె. సుధాకర్‌రెడ్డి సుమారు రూ. రెండు లక్షల విలువైన పట్టు వస్త్రాలను దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. సురేష్‌బాబుకు అందచేశారు. ఈ పట్టు వస్త్రాలను స్వామివారి కల్యాణానికి వినియోగించాలని భక్తుడు కోరారు. ఈ సందర్భంగా దాతను దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. సురేష్‌బాబు, అసిస్టెంట్ కమీషనర్ ఈరంకి జగన్నాధరావు, తదితరులు అభినందించారు. 

ads