ప్రగతిలో ప్రారంభమైన ఎన్.సి.సి శిక్షణా శిబిరం

UPDATED 11th MAY 2019 SATURDAY 10:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో పది రోజుల పాటు నిర్వహించనున్న ఎన్.సి.సి శిక్షణా శిబిరం శనివారం ప్రారంభమైంది. ఈ శిబిరాన్ని 9(A) ఎయిర్ ఫోర్స్ వింగ్ (కాకినాడ) ఆధ్వర్యంలో ఎయిర్ కమాండెంట్, గ్రూప్ కాంపెయిన్ డిఎస్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ వివిధ సైనిక విభాగాల్లో ఎన్.సి.సి విద్యార్థులకు అత్యుత్తమ అవకాశాలు ఉన్నాయని, తమ కళాశాలలో నిర్వహిస్తున్న ఈ క్యాంపు ద్వారా సైనిక దళాల్లో విద్యార్థులు ఉద్యోగ అవకాశాలను పొందే అవకాశం ఉందని అన్నారు. ముఖ్య అతిధి 9(A) ఎయిర్ కమాండెంట్, గ్రూప్ కెప్టెన్ విఎస్ రావు మాట్లాడుతూ పది రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ క్యాంపు ఎన్.సి.సి, ఎయిర్ ఫోర్స్ క్యాడెట్లకు చెందిన ఆరు వందల మందికి శిక్షణ ఇస్తున్నామని, తద్వారా వారు ఆయా రంగాలకు చెందిన వివిధ అంశాల్లో నైపుణ్యాన్ని సాధించి సైనిక దళాల్లో ఉద్యోగాలు సాధించడానికి కావలసిన శిక్షణ పొందుతారని అన్నారు. ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొంటున్న విద్యార్థుల్లో శారీరక, మానసిక సామర్ధ్యాలను పెంపొందింపచేసే విధంగా ఈ క్యాంపు ఉంటుందని పేర్కొన్నారు. ఈ శిక్షణా శిబిరానికి కళాశాల ఎన్.సి.సి ఆఫీసర్ లెఫ్టినెంట్ జెడి నాయుడు కో ఆర్డినేటరుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ మేనేజ్ మెంట్ ఎంవి హరనాధబాబు, డైరెక్టర్ జి. రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, తదితరులు క్యాడెట్లను అభినందించారు.         

 

ads