అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా సచివాలయ సిబ్బంది కృషి చేయాలి: తహశీల్దార్ రామకృష్ణ

గంగవరం:12 సెప్టెంబరు 2020(రెడ్ బీ న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని వాటిని సమర్థవంతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా గ్రామ సచివాలయ సిబ్బంది కృషి చేయాలని ఇంచార్జ్ తహశీల్దార్ పి. రామకృష్ణ అన్నారు. జగ్గంపాలెం, నెల్లిపూడి పిడతమామిడి, మొల్లేరు గ్రామ సచివాలయాలును ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లతో మాట్లాడారు. జగ్గంపాలెం సచివాలయంలో రైస్ కార్డుల పంపిణీ ఆర్.వో. ఎఫ్.ఆర్ పట్టాలు ప్రక్రియ తదితర అంశాలపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా రైస్ కార్డుల పంపిణీ ఆర్.వో. ఎఫ్.ఆర్ పట్టాలు రెవెన్యూ పరమైన సమస్యలు వాటి పరిష్కారం తదితర వాటి గురించి గ్రామ సచివాలయం సిబ్బందిని ఆరాతీశారు. గ్రామ సచివాలయం సిబ్బంది కార్యదర్శి డీ.వీరబాబు వీఆర్వో వెంకాయమ్మ గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ads