ఆంగ్ల భాషా పరిజ్ఞానం పెంచుకోవాలి

UPDATED 13th FEBRUARY 2020 THURSDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): ప్రతీ ఒక్కరూ ఆంగ్ల భాషపై పరిజ్ఞానం పెంపొందించుకోవాలని సర్వశిక్షా  అభియాన్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ బి. విజయభాస్కర్ పేర్కొన్నారు. సామర్లకోట మండలం ఉండూరు గ్రామంలో ఆంగ్ల భాషపై ప్రారంభమైన రెండవ విడత  శిక్షణా కార్యక్రమాన్ని ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ ఆంగ్లం భాషపై పరిజ్ఞానం  పెంపొందించడానికి చిత్రాలు చూడడం, పాత్రలు సన్నివేశాలు ఆంగ్లంలో మాట్లాడటం చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతన్నందున జిల్లావ్యాప్తంగా ఇంగ్లీష్ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఉపాధ్యాయులు కమ్యూనికేషన్ స్కిల్స్ అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారిణి ఎస్. విజయలక్ష్మీ దేవి, హెచ్ఎం వెంకటరెడ్డి, రిసోర్స్ పర్సన్ అర్జున్ కుమార్, తాతబ్బాయి, జయప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

ads