మరిడమ్మ హుండీ ఆదాయం లెక్కింపు

UPDATED 17th MARCH 2021 WEDNESDAY 6:00 PM

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) : పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి హుండీ ఆదాయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల సమక్షంలో బుధవారం లెక్కించారు. దేవస్థానం సహాయ కమీషనర్ కె. విజయలక్ష్మీ పర్యవేక్షణలో ఈ లెక్కింపు కార్యక్రమం జరిగింది. 95 రోజుల కాలానికి రూ.5,25,801 ఆదాయం సమకూరినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఫౌండర్ ట్రస్టీ డాక్టర్ చింతపల్లి బ్రహ్మాజీ, ఎం. మురళి, తదితరులు పాల్గొన్నారు.

ads