పెద్దాపురం తహసీల్దారుకు వీడ్కోలు

UPDATED 8th FEBRUARY 2019 FRIDAY 10:00 PM

పెద్దాపురం: పెద్దాపురం తహసీల్దారుగా పనిచేస్తున్న గంగుమళ్ల బాలసుబ్రమణ్యం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు బదిలీ అయిన సందర్భంగా శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బాలసుబ్రమణ్యం, ఆయన సతీమణి శ్రీదేవిని రెవిన్యూ సిబ్బంది పూలమాలలు, దుశ్శాలువాతో సన్మానించి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ టి. కృష్ణారావు, రెవిన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.  

ads