వాహనాదారులు నిబంధనలు పాటించాలి

UPDATED 14th FEBRUARY 2020 FRIDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్) : వాహనాదారులు విధిగా నిబంధనలను పాటించాలని సామర్లకోట ఎస్ఐ సుమంత్ పేర్కొన్నారు. స్థానిక రింగ్ సెంటర్ వద్ద శుక్రవారం పలు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి  నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడిపే వారిపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ సుమంత్ మాట్లాడుతూ చట్టాన్ని అతిక్రమించి ఓవర్ లోడుతో వాహనాలు నడపడం, మద్యం సేవించి వాహనాలు నడిపితే శిక్షలు తప్పవని హెచ్చరించారు. అలాగే వాహనాలకు సంబంధించి పూర్తి రికార్డులు వాహనదారుల వద్ద ఉండాలని, నిబంధనలు పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ బాలాజీ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ads