అభద్రతకు గురిచేసే చట్టాలు రద్దు చేయాలి

UPDATED 13th FEBRUARY 2020 THURSDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): దేశ ప్రజలను అభద్రతకు గురిచేసే చట్టాలను తక్షణమే రద్దు చేయాలని అంగన్వాడీ యూనియన్ గౌరవ అధ్యక్షుడు, సిఐటీయు మండల ఉపాధ్యక్షుడు బాలం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అంగన్వాడీ యూనియన్ అధ్యక్షురాలు వి. వెంకటలక్ష్మి అధ్యక్షతన స్థానిక సీఐటీయూ కార్యాలయంలో సామర్లకోట అంగన్వాడీ అర్బన్ ప్రాజెక్ట్ పరిధిలో గల అంగన్వాడీ కార్యకర్తలతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలకు వ్యతిరేకంగా పాలన చేస్తూ దాని నుంచి దృష్టి మరల్చడానికి తెచ్చిన నల్ల చట్టాలను తక్షణమే వాటిని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యదర్శి ఎ. అమలావతి, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి టి. నాగమణి, కె. వరలక్ష్మి, బి.లక్ష్మీ, ఎం. రమణమ్మ, హెచ్.వి. రమణమ్మ, సురేష్, చైతన్య, తదితరులు పాల్గొన్నారు.

 

ads