కరోనాపై అవగాహన

UPDATED 20th MARCH 2020 FRIDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): కరోనా వ్యాధి వ్యాపించకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబు పేర్కొన్నారు. కరోనా పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ పట్టణంలో  మున్సిపల్ కమీషనర్ ఆధ్వర్యంలో సిబ్బంది శుక్రవారం  ప్రత్యేక అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమీషనర్ ఏసుబాబు మాట్లాడుతూ కరోనా వ్యాధి వ్యాపించకుండా ప్రజలు మాస్కులు ధరించాలని, దగ్గు, తుమ్ము, గొంతు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు ఉంటే ఆందోళన చెందకుండా తక్షణం వైద్యులను సంప్రదించాలని అన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, కొత్తగా కలిసే వ్యక్తులకు షేక్‌హ్యాండ్‌ ఇవ్వరాదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇనస్పెక్టర్   రాజశేఖర్, హెల్త్ అసిస్టెంట్ పి. చిట్టిబాబు, తదితరులు పాల్గొన్నారు. 

 

ads