గణిత చదరంతో 75వ స్వాతంత్ర్య దినోత్సవానికి శుభాకాంక్షలు

UPDATED 14th AUGUST 2021 SATURDAY 8:00 PM

గండేపల్లి (రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో తృతీయ సంవత్సరం కంప్యూటర్ సైన్స్ విద్యార్థిని తోటకూర హేమమణివర్షిత గణిత చదరాలతో 75వ స్వాతంత్ర్య దినోత్సవానికి శుభాకాంక్షలు తెలిపింది. అడ్డువరుసలు మొత్తం 75, నిలువు వరసలు మొత్తం75, కర్ణాల మొత్తం 75 ఇలా ఎటు కూడినా 75 వచ్చేలా రూపొందించి తన అభిమానాన్ని చాటుకున్నారు. జాతీయ పర్వదినాలు, మహనీయుల పుట్టిన రోజు, తదితర వేడుకలు ఈ విధంగా గణిత చదరాల ద్వారా తెలియజేయడం ఎంతో ఆనందంగా ఉంటుందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్  రెడ్డి, క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, డీన్ డాక్టర్ రవి కుమార్, విభాగాధిపతులు,  అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ఆమెను అభినందించారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us