మహాశివరాత్రి పోస్టర్ ఆవిష్కరణ

UPDATED 11th FEBRUARY 2019 SUNDAY 9:00 PM

సామర్లకోట: వచ్చే నెల మార్చి 4వ తేదీ నుంచి జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రసిద్ధ పంచారామ క్షేత్రాల్లో ఒకటైన స్థానిక శ్రీ కుమారరామ భీమేశ్వరస్వామి ఆలయ ఆవరణలో మహాశివరాత్రి ఉత్సవాల పోస్టరును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆదివారం  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ ప్రతీ సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, మహాశివరాత్రి పర్వదినాన స్వామివారిని దర్శించుకొనేందుకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తారని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పులి నారాయణమూర్తి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, గుమ్మళ్ల రామకృష్ణ, దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్, ట్రస్ట్ బోర్డు సభ్యులు మహంకాళి వెంకట గణేష్, పడాల వీరబాబు, దూది రాజు, వేదపండితులు వేమూరి సోమేశ్వరశర్మ, కొంతేటి జోగారావు, చెరుకూరి భీమన్న, శర్మ, రాంబాబు శర్మ, గుమస్తా వీరభద్రరావు, తదితరులు పాల్గొన్నారు.

ads