విద్యార్థుల ఇంటికే నేరుగా రేషన్

సామర్లకోట,17 సెప్టెంబరు 2020 (రెడ్ బి న్యూస్): సామర్లకోట పట్టణంలోని మున్సిపల్ ఉన్నత పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి కరోనా లాక్ డౌన్ కారణంగా పాఠశాలలు మూతబడిన నేపథ్యంలో వారి భోజనానికి సంబంధించి నేరుగా వారి గృహానికే రేషన్ అందే విధంగా ఈ పంపిణీ చేపడుతున్నట్టు బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల హెచ్ఎం తోటకూర సాయి రామకృష్ణ చెప్పారు. ఈ పాఠశాలలతో పాటు ఉన్నత పాఠశాల తోట గోపాలకృష్ణ హైస్కూల్, మున్సిపల్ ఉన్నత పాఠశాల తో పాటు భాస్కర రామారావు ఉన్నత పాఠశాల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, గవర్నమెంట్ ఉన్నత పాఠశాల, సిపిఎం ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో ఈ రేషన్ అందజేత కార్యక్రమాలను ఆధ్వర్యంలో చేపట్టారు. ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుకున్న విద్యార్థులకు మొదటి 15 రోజులకు సంబంధించి బియ్యం, కోడిగుడ్లు, చిక్కీలు అందిస్తున్నట్లు హెచ్ఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ జానకిరామయ్య వైసీపీ నాయకులు చిట్టిమాని శ్రీనివాసరావు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ads