మరిడమ్మ అమ్మవారికి ఘనంగా పంచామృతాభిషేకం

UPDATED 13th MAY 2019 MONDAY 7:00 PM

పెద్దాపురం: పెద్దాపురం పట్టణంలో వేంచేసిఉన్న మరిడమ్మ అమ్మవారి జన్మ నక్షత్రం మఖను  పురస్కరించుకుని సోమవారం అమ్మవారికి పంచామృతాభిషేకం ఘనంగా నిర్వహించారు. దేవస్థానం వేదపండితులు చిట్టెం హరిగోపాలశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ కె. విజయలక్ష్మి, పండితులు ఐవి ప్రసాద్ శర్మ, అవధాని, ఎన్.వి. శాస్త్రి, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.    

ads