అబ్దుల్‌ కలాం సేవలు చిరస్మరణీయం

UPDATED 15th OCTOBER 2020 THURSDAY 8:00 PM

గండేపల్లి (రెడ్ బీ న్యూస్): దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం సేవలు చిరస్మరణీయమని పాలిటెక్నిక్  కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.టి.వి.ఎస్. కుమార్ పేర్కొన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థలకు  చెందిన పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో భారతదేశ 11వ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ అబ్దుల్‌ కలాం 89వ జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ప్రిన్సిపాల్ కుమార్ మాట్లాడుతూ అబ్దుల్‌ కలాం ‌శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి ఎనలేని సేవలందించారన్నారు. కలాంను విద్యార్థులు, యువత స్ఫూర్తిగా తీసుకొని అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ మాధవరావు, గ్రంధాలయాధికారి కె. అశోక్ కుమార్, వివిధ విభాగాల అధిపతులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

 

ads