సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి

UPDATED 8th FEBRUARY 2019 FRIDAY 9:00 PM

సామర్లకోట: సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఎపి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కొర్ల కృష్ణారావు అన్నారు. స్థానిక భీమేశ్వర లయన్స్ క్లబ్ భవనంలో మున్సిపల్ రెగ్యులర్, కాంట్రాక్ట్ కార్మికుల సమావేశం జిల్లా నాయకులు ఉప్పలపాటి చంద్రదాస్ అధ్యక్షతన శుక్రవారం  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎపి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కొర్ల కృష్ణారావు హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల ఉపాధి భద్రతకు తూట్లు పొడిచే విధంగా కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్నాయని, ప్రతీ కార్మికుడికి సమాన పనికి సమాన వేతనంగా రూ.18 వేలు వేతనం చెల్లించాలని అన్నారు.  గత సంవత్సరం అక్టోబర్ నెలలో జరిగిన సమ్మె కాలంలో రాష్ట్ర మున్సిపల్ అధికారులు డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పి పరిష్కరించకపోవడంతో ఈనెల 5వ తేదీన గుంటూరులో డిఎంఎ కార్యాలయాన్ని ముట్టడించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు శిరంశెట్టి వెంకటేష్, బి. శ్రీను, సింగంపల్లి శ్రీనివాస్, సింగంపల్లి అనసూర్య, చిన్ని లక్ష్మి, పైడి రాజు, సింగంపల్లి పద్మ, మల్లిపూడి లక్ష్మీ, బంగారు చంద్రరావు, పలివెల పాప, తదితరులు పాల్గొన్నారు.

ads